Saturday 8th August 2026
12:07:03 PM
Home > తాజా > త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్.. ఎఫ్ఎం ఛానల్ కూడా: రంగనాథ్!

త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్.. ఎఫ్ఎం ఛానల్ కూడా: రంగనాథ్!

av ranganath

Hydra Police Station | హైద్రాబాద్ (Hyderabad) నగరంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయంగా హైడ్రా (Hydra)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ హైడ్రాకు సంబంధించి కమిషనర్ రంగనాథ్ కీలక విషయాలు వెల్లడించారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం హైడ్రాకు చైర్మన్ (Hydra Chairman)గా వ్యవహరిస్తారని తెలిపారు. త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ (Hydra Police Station) కూడా నిర్మించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పని చేస్తుందని వెల్లడించారు.

హైడ్రా పరిధిలో 1025 చెరువులున్నట్టు గుర్తించామని రంగనాథ్ పేర్కొన్నారు. సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇమేజ్ రికార్డులు సేకరించినట్టు వివరించారు. హైడ్రా కేవలం కూల్చివేతల కోసమే ఏర్పాటు చేసినట్టుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

హైడ్రా చెరువులు పునరుద్ధరణ చేస్తుందని త్వరలోనే నిరూపిస్తామన్నారు. 72 డీఆర్ఎఫ్ టీమ్‌లు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు.

చెట్లు పడిపోవడం, నీళ్లు నిలవడం, ఫైర్ ఆక్సిడెంట్లపై డీఆర్ఎఫ్ పని చేస్తుందని వెల్లడించారు. హైడ్రా కోసం ఒక ఎఫ్ఏం ఛానెల్ కూడా పెట్టాలని ఆలోచన చేస్తున్నామని రంగనాథ్ తెలిపారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
హైడ్రా పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions