Tuesday 24th November 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > శాలువాలే చిన్నపిల్లల డ్రెస్సులై..టీడీపీ ఎమ్మెల్యే వినూత్న ఆలోచన

శాలువాలే చిన్నపిల్లల డ్రెస్సులై..టీడీపీ ఎమ్మెల్యే వినూత్న ఆలోచన

Chintamaneni Prabhakar News | ఏపీ ( Andhra Pradesh )లోని దెందులూరు ( Denduluru ) ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పేద బాలికలకు ఉపయోగపడేలా ఓ కొత్త ఆలోచనను అమలు పరిచారు.

సాధారణంగా రోజూ ప్రజాప్రతినిధులను కలవడానికి వచ్చిన వారు బొకేతోపాటు, శాలువాలు ( Shawls ) కప్పుతుంటారు. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులకు రోజు వందల సంఖ్యలో శాలువాలు వచ్చి చేరుతుంటాయి. అవి తర్వాత ఏమయ్యాయో కూడా పట్టించుకోరు.

అయితే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆ శాలువాలను బాలికలకు ఉపయోగపడేలా మార్చారు. ఆ శాలువాలతో నిరుపేద బాలికల కోసం డ్రెస్సులు కుట్టించారు.

క్రిస్ మస్ సందర్భంగా తల్లిదండ్రులు లేని చిన్నారులు, హాస్టళ్లలో ఉండే పేద విద్యార్థినిలకు అందించారు. దీంతో ఎమ్మెల్యే ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

You may also like
TG: ‘అర్నబ్’ తుపాను కల్లోలం: 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions