Wednesday 15th April 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఆస్ట్రేలియా మీడియా విరాట్ కోహ్లీ గొడవ..అసలేం జరిగిందంటే !

ఆస్ట్రేలియా మీడియా విరాట్ కోహ్లీ గొడవ..అసలేం జరిగిందంటే !

Kohli Involved In Heated Argument With Australian Media | తన అనుమతి లేకుండా తన పిల్లల వీడియోలను ఎలా చిత్రీకరిస్తారంటూ ఆస్ట్రేలియా మీడియా రిపోర్ట్ ( Media Reporter ) పై టీం ఇండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) వాగ్వాదానికి దిగారు.

బాక్సింగ్ డే టెస్టు ( Boxing Day Test ) మ్యాచు కోసం ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం శుక్రవారం విరాట్ కోహ్లీ మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ ( Melbourne Airport ) కు చేరుకున్నారు. ఇదే సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు విరాట్ ఫ్యామిలీని వీడియోలు తీస్తున్నారు.

ఈ క్రమంలో అసహనానికి గురైన కోహ్లీ మీడియా ప్రతినిధి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తను కుటుంబంతో ఉన్నప్పుడు కొంచెం ప్రైవసి ( Privacy ) ఇవ్వాలని, తన అనుమతి లేకుండా పిల్లల ఫోటోలు, వీడియోలు ఎలా తీస్తారంటూ నిలదీశారు.

అనంతరం తాము పిల్లల ఫోటోలు తీయడం లేదని మీడియా ప్రతినిధులు కోహ్లీకి సర్ది చెప్పారు. దింతో వారికి షేక్ హ్యాండ్ ఇచ్చిన కోహ్లీ అక్కడి నుండి వెళ్లిపోయారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions