Tuesday 8th September 2026
12:07:03 PM
Home > తాజా > ఆసిఫాబాద్ లో పులి దాడి..యువతి మృతి

ఆసిఫాబాద్ లో పులి దాడి..యువతి మృతి

Asifabad Tiger Attack News | కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ పులి దాడి చేయడంతో యువతి మృతి చెందింది.

వివరాల్లోకి వెళ్తే కాగజ్ నగర్ ( Kagaznagar ) మండలం బెంగాలి క్యాంప్ 6 నెంబర్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన 21 ఏళ్ల మోర్లే లక్ష్మి పై పులి దాడి చేయడంతో యువతి అక్కడిక్కడే మృతి చెందింది.

ఘటన జరిగే సమయంలో కొద్దీ దూరంలోనే కొందరు కూలీలు ఉన్నారు. వారు కేకలు వేసినా యువతిపై పులి దాడి మాత్రం ఆగలేదు. యువతిపై దాడి చేసిన అనంతరం పులి అడవిలోకి వెళ్ళిపోయింది.

లక్ష్మీ మృతదేహంతో బంధువులు కాగజ్ నగర్ లోని అటవీశాఖ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

You may also like
విమానం తరహా వసతులతో కేరళ KSRTC లగ్జరీ బస్సు!
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions