Monday 30th March 2026
12:07:03 PM
Home > సినిమా > ఓ స్టార్ హీరో ఆమెను వేధిస్తున్నాడు: పూన్ కౌర్ సంచలన పోస్ట్!

ఓ స్టార్ హీరో ఆమెను వేధిస్తున్నాడు: పూన్ కౌర్ సంచలన పోస్ట్!

Poonam Kaur Tweet | టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. ఓ స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో అంటూ పలు ఆరోపణలు కూడా చేశారు.

తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా ఓ స్టార్ నటుడు ఓ హీరోయిన్ ని వేధించాడంటూ పోస్ట్ చేశారు. ” నేను తెలుగులో చేసిన ఒక సోషియో ఫాంటసీ చిత్రం లో నాతో పాటు ఒక అమ్మాయి నటించింది. ఆ తర్వాత ఆమె హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించింది.

అయితే కొన్నేళ్లుగా ఆమె సినిమాల్లో నటించడం మానేసింది. అనంతరం ఇండస్ట్రీకి దూరంగా ఎవరికీ కనిపించకుండా పోయింది. తాజాగా ఆమె నాకు ఒక డొమెస్టిక్ ఫ్లైట్‌లో కనిపించింది. పెళ్ళి కి షాపింగ్‌కి వచ్చినట్లు, తాను ఆ దేశం లో ఉన్నట్లు ఎవరికీ చెప్పొదంటూ రిక్వెస్ట్ చేసింది.

ఏమైందని నేను అడగగా ‘ఒక సూపర్ స్టార్ డమ్ కలిగిన హీరో నన్ను వేధిస్తున్నా డు. నేను ఎక్క డికి వెళితే అక్కడికి వచ్చి ఫాలో అవుతున్నాడు. మేము సినిమాలో ఇంటిమెటెడ్ సీన్ చేసినప్పుడు ఆయన నా మొహంపై నిజంగానే ఉమ్మి వేశాడు.

డైరెక్టర్ కనీసం కట్ కూడా చెప్ప లేదు’ అం టూ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీ వదిలి అమెరికాలో చదువుకోవడానికి వెళ్లినట్లు చెప్పింది. కానీ.. ఆ హీరో వేధింపులు ఇంకా తగ్గలేదని చెప్పింది. ఇదేమి కట్టు కథ కాదు. ఆ అమ్మా యిని నేను హగ్ చేసుకొని ఓదార్చాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions