Friday 17th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > డాంకీ ప్యాలెస్ బాధితుల మీడియా సమావేశం

డాంకీ ప్యాలెస్ బాధితుల మీడియా సమావేశం

Donkey Milk Scam | రెండు తెలుగు రాష్ట్రాల్లో డాంకీ ప్యాలెస్ ( Donkey Palace ) రూ.వంద కోట్ల స్కాం జరిగింది. తమిళనాడు ( Tamilnadu ) లోని తిరునల్వేలి లో స్కాంకి కేటుగాళ్లు శ్రీకారం చుట్టారు. సంవత్సరంన్నర నుండి దీని మీద పోరాటం చేస్తున్నట్లు బాధితులు చెప్పారు.

వంద లాది మంది మోసపోయామని,ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ బాధితులున్నారని తెలిపారు. ఒక తమిళనాడు చెందిన కలెక్టర్ తో డాంకీ ప్యాలెస్ ను ప్రారంభించారు..సోనికా రెడ్డి తో యూ ట్యూబ్ లో బాగా పబ్లిసిటీ చేశారు..రెండు గంటల ట్రైనింగ్ కు రూ. 50 వేలు తీసుకున్నారని బాధితులు తెలిపారు.

మన దేశం లో డాంకి మిల్క్ ( Donkey Milk ) వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతులు లేవు,ఫాం కావాలంటే రూ.5 లక్షలు కట్టాలి..ఒక్కో గాడిద రూ.80 వేల నుండి లక్ష వరకు అమ్మారని పేర్కొన్నారు. మూడు నెలలు వరకు పాలకు డబ్బులు బాగానే ఇచ్చారని కానీ డాంకీ ప్యాలెస్ ముఖ్య సూత్రదారి తమిళనాడు లోని తిరునల్వేలి కి చెందిన బాబు వులగనదం, సొనికా రెడ్డి, గిరి సుందర్, బాలాజీ శబరి నాథ్ సభ్యులుగా డాంకీ ప్యాలెస్ ఏర్పాటు చేసి మోసం చేసారని బాధితులు వాపోయారు.

నారా లోకేష్ ( Minister Lokesh ) కి మా గోడు వెళ్లబోసుకున్నాము..మా సమస్య మీద కేటీఆర్ ( KTR ) ట్విట్టర్ ద్వారా రెస్పాండ్ ( Respond ) అయినట్లు వారు చెప్పారు. తాజిలాన్నాడు సిఎం స్టాలిన్ కు కూడా మేము విన్నపం చేస్తున్నాము..ఆన్లైన్ లో వెబ్ సెట్ లో ఐ కార్ వెబ్సైట్లో సక్సెస్ స్టోరీ చూసి ప్రకటనలు చూసి మోసపోయామన్నారు.

ప్రతి రైతు వద్ద సుమారు రూ.40 లక్షల మీద దోచుకున్నారని చెప్పారు. డాంకీ హౌస్ ప్యాలెస్ పేరుతో యూట్యూబ్ లలో వెబ్సైట్లో పలు ప్రకటనలు కూడా చేశారని తెలిపారు. ఆ ప్రకటనలు చూసి కొంతమంది రైతులు వెబ్సైట్లో వివరాలను పొందుపరిచారని, ల్యాండ్ వివరాలతో పాటుగా గాడిదలు ఎన్ని కావాలో కూడా ఆ వెబ్సైట్లో పొందుపరుస్తారన్నారు.

ఆ తరువాత ఇచ్చిన వివరాలు కరెక్టా కాదా అని డాంకీ హౌస్ ప్యాలెస్ నుంచి నిర్వాహకులు రైతులు వద్దకు వస్తారు.. రైతు దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ పరిశీలిస్తారు, ఆ తర్వాత కావలసిన గాడిదలను రైతులకు అందజేస్తారని పేర్కొన్నారు.

గాడిదల నుంచి వచ్చేటటువంటి పాలను తిరిగి డొంకి హౌస్ ప్యాలెస్ కు పంపిస్తారు, డాంకీ హౌస్ లీటర్ కు రూ. 1600 రూపాయలు చెల్లిస్తారు, ఇది రైతుల మధ్య ఒప్పందమని చెప్పారు. ఇలా కొన్ని వేల లీటర్లు డాంకీ ప్యాలెస్ కు ఇచ్చిన రైతులు. మొదటగా లాభాలు చూపించి ఆ తర్వాత రైతులను మోసం చేసిన డాంకీ ప్యాలెస్ హౌస్ నిర్వాహకులు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions