Wednesday 18th March 2026
12:07:03 PM
Home > తాజా > టీచర్ పోస్ట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్!

టీచర్ పోస్ట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్!

Telangana TET Notification 2024 | తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు సర్కారు శుభవార్త చెప్పింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్‌ ( Notiication )ను విడుదల చేసింది.

ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) ఏడాదికి రెండు సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (TET) నిర్వహిస్తామని అభ్యర్థులకు మాట ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ ఏడాదిలో రెండోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ. అయితే ఈ టెట్ పరీక్షలు జనవరిలో జరగనున్నాయి.

2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ( Online )లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అభ్యర్థులు నవంబర్ 5 నుంచి 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకు నిర్వహించిన టెట్ పరీక్షలకు 2.35 లక్షల మంది హాజరు కాగా, 1.09 లక్షల మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలని చెప్పడంతో, వేలాది మంది సర్వీసులు ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions