Sunday 22nd March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మహారాష్ట్ర మాజీ మంత్రి హత్య..ఆ గ్యాంగ్ పనేనా ?

మహారాష్ట్ర మాజీ మంత్రి హత్య..ఆ గ్యాంగ్ పనేనా ?

Baba Siddique Shot Dead News | మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నాయకులు బాబా సిద్ధిఖీ ( Baba Siddique ) హత్య మహా ( Maharastra ) రాజకీయాల్లో మరియు బాలీవుడ్ ( Bollywood ) లో సంచలనంగా మారింది.

శనివారం దసరా సందర్భంగా ముంబై బాంద్రా( Bandra )లోని తన కుమారుడి ఆఫీస్ ముందు బాబా సిద్ధిఖీపై ముగ్గురు దుండగులు మూడురౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే బాబా సిద్ధిఖీ కన్నుమూశారు.

కాగా ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన కర్నయిల్ సింగ్ ( Karnail Singh ), యూపీకి చెందిన ధర్మరాజ్ కశ్యప్ అనే నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ( Lawrence Bishnoi Gang ) కు చెందిన వారిమని నిందితులు పేర్కొన్నారు.

అయితే ఈ హత్యపై మాత్రం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా బాబా సిద్దిఖీ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ( Salman Khan )కు అత్యంత సన్నిహితుడు. సల్మాన్ ఖాన్ ఇంటి పై గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపిన విషయం తెల్సిందే

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions