Friday 22nd November 2024
12:07:03 PM
Home > తాజా > హైదరాబాద్ లో రూ.7 వేల కోట్ల భారీ స్టాక్ మార్కెట్ మోసం

హైదరాబాద్ లో రూ.7 వేల కోట్ల భారీ స్టాక్ మార్కెట్ మోసం

Rs. 7000 Cr Stock Broking Scam In HYD | అధిక లాభాల ఆశ చూపి ఓ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. స్టాక్ మార్కెట్ ( Stock Market )లో భారీ లాభాలు వస్తాయని చెప్పి డిపాజిట్లు ( Deposites ) వసూలు చేసి బిచాన ఎత్తేశారు.

వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ లో డీబీ స్టాక్ బ్రోకింగ్ ( DB Stock Broking ) అనే సంస్థ ఏడాదికి 120 శాతం లాభాలు ఇస్తామని ఏకంగా 20 వేల మందిని బురిడీ కొట్టించింది. 2018 నుండి ఈ సంస్థ కస్టమర్ల వద్దనుండి డిపాజిట్లు స్వీకరించింది.

20 వేల మంది నుండి ఏకంగా రూ.7 వేల కోట్లను సదరు సంస్థ వసూలు చేసింది. అయితే గత కొన్నిరోజులుగా చెల్లింపులు ఆగిపోయాయని బాధితులు వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎకనామిక్ ఎఫెన్సిక్ వింగ్ ( Economic Offences Wing ) కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions