Friday 4th October 2024
12:07:03 PM
Home > తాజా > ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో!  

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో!  

Metro

Hyderabad Metro Offers | హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న ఆఫర్ల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో రైలులో సూపర్​ సేవర్​-59, స్టూడెంట్​ పాస్​, సూపర్​ సేవర్​ ఆఫ్​ పీక్​ అవర్​ ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్​ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. సూపర్ సేవర్ 59 (Super Saver 59) ద్వారా సెలవు రోజుల్లో కేవలం రూ.59 చెల్లించి అపరిమత ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

ఇక విద్యార్థులు 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులు పొందే ఆఫర్​ స్టూడెంట్​ పాస్​ ఆఫర్​ కొనసాగుతుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 9 నుంచి 11 గంటల మధ్య మెట్రో కార్డు ద్వారా ప్రయాణిస్తే వారికి కూడా 10 శాతం రాయితీని అందిస్తున్నారు. ఈ ఆఫర్ల గడువు సెప్టెంబర్ 29తో ముగిసింది. అయితే తాజాగా ఈ మూడు ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు మెట్రో తెలిపింది.

You may also like
Ram Charan
రామ్ చరణ్ కు అరుదైన గౌరవం!
harish rao
హస్తం తీసేసి ఆ గుర్తు పెట్టుకోండి.. కాంగ్రెస్ పై హరీశ్ రావు హాట్ కామెంట్స్!
cm revanth reddy
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్!
chess
చెస్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఆటగాళ్లకు సీఎం అభినందనలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions