Sunday 22nd March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > గుడ్ న్యూస్.. రూ. 99కే మల్టీప్లెక్స్ లో సినిమా చూసేయొచ్చు!

గుడ్ న్యూస్.. రూ. 99కే మల్టీప్లెక్స్ లో సినిమా చూసేయొచ్చు!

Theatre

Movies Ticket At Rs 99 Only | సినిమా ప్రియులకు ఓ గుడ్ న్యూస్. కేవలం రూ. 99లకే మల్టీ ప్లెక్స్ లో ఓ రోజు మీకు నచ్చిన సినిమా చూసేయచ్చు.

జాతీయ చలన చిత్ర దినోత్సవం (National Cinema Day) సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Multiplex Association Of India) సెప్టెంబర్ 20న సినీ ప్రియులకు స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది.

కేవలం 99 రూపాయలకే మల్టీఫ్లెక్స్‌ లో సినిమా చూడవచ్చని వెల్లడించింది. సెప్టెంబర్‌ 20న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లోని4 వేలకు పైగా స్క్రీన్లలో కేవలం 99 రూపాయలకే నచ్చిన సినిమాని వీక్షించవచ్చు.

హైదరాబాద్‌లోని PVR, INOX, మిరాజ్‌, ఏషియన్‌, సినీపోలీస్‌ వంటి ప్రధాన మల్టీప్లెక్స్‌లో ఈ ఆఫర్ ఉంది. ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వారా ఈ 99 రూ. ల టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ఒక లాగిన్‌పై ఆరు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ ఆరోజు ప్రదర్శించే అన్ని సినిమాలతో పాటు అన్ని షోలకు వర్తిస్తుందని ఎంఏఐ తెలిపింది. 

You may also like
rajendra prasad
క్షమాపణలు చెప్పండి.. ఇంతటితో ముగించండి!
pramodh shetty
రష్మిక తన పెళ్లికి మమ్మల్నిపిలవదని తెలుసు: ప్రమోద్ శెట్టి
chiranjeevi
నా విజయ రహస్యం నువ్వే అని చెబుతా.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
vijay and rashmika in vd14
విజయ్ రష్మిక పెళ్లి డేట్ ఇదే.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions