Wednesday 4th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం..మంచి రోజులు వస్తాయి

కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం..మంచి రోజులు వస్తాయి

ys jagan

Ys Jagan Pulivendula Tour News | మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పులివెందులలో రెండవ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివారం పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు.

కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం, మళ్ళీ మంచిరోజులు వస్తాయని, ఎవరూ అధైర్యపడొద్దు, రాబోవు కాలం మనదేనని, ప్రతి కుటుంబంలో చేసిన మంచి ఉంది, వైసీపీ పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది, భవిష్యత్‌ మనదేనని జగన్ ధీమా వ్యక్తపరిచారు.

నిరంతరం ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా అడుగులు వేయాలని శ్రేణులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు.

రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా ఉంటుందని వైయస్ జగన్‌ భరోసానిచ్చారు.

You may also like
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
రాయలసీమను ఎడారిగా మార్చే కుట్ర
భోగాపురంలో తొలి ఫ్లైట్ ల్యాండ్..గొప్ప మైలురాయన్న జగన్
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు..బాబు ముసుగు తొలిగిందన్న వైసీపీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions