PM Modi To Visit Ukraine | ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) బుధవారం మూడు రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. బుధవారం, గురువారం పోలాండ్ (Polland)దేశంలో పర్యటించనున్న ప్రధాని శుక్రవారం ఉక్రెయిన్ (Ukraine) రాజధాని కీవ్ లో పర్యటించనున్నారు.
సుమారు 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్ లో పర్యటించనుండడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1979 లో నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్ ను సందర్శించారు. భారత్, పోలాండ్ ల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రధాని ఈ పర్యటనకు వెళ్లారు.
ఈ నేపథ్యంలో స్పందించిన ప్రధాని పోలాండ్ ప్రెసిడెంట్ అంద్రెజ్ దుడా, ప్రధాని డోనాల్డ్ టస్క్ తో భేటీ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అనంతరం పోలాండ్ నుండి ఆగస్ట్ 23న ప్రత్యేక రైలులో సుమారు 10 గంటలు ప్రయాణించి ప్రధాని మోదీ ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకోనున్నారు.
ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదమిర్ జెలెన్స్కి తో భేటీ అవ్వనున్నారు. గత రెండేళ్లుగా కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ లో త్వరగా శాంతి, స్థిరత్వం నెలకొనాలని ప్రధాని కాంక్షించారు.