Wednesday 15th April 2026
12:07:03 PM
Home > క్రీడలు > యువరాజ్ రికార్డ్ బ్రేక్..ఒకే ఓవర్ లో 39 పరుగులు

యువరాజ్ రికార్డ్ బ్రేక్..ఒకే ఓవర్ లో 39 పరుగులు

Samoa Batter Breaks Yuvraj Record | టీం ఇండియా ( Team India ) మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) పేరిట ఉన్న అరుదైన ఘనతను బ్రేక్ చేశాడు సమోవా దేశ ఆటగాడు. ఒకే ఓవర్ లో 39 పరుగులతో ఈ ఫీట్ ను సాధించాడు.

2026 టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైర్ ( World Cup Qualifier ) మ్యాచులో భాగంగా సమోవా ( Samoa ) వనువాటు ( Vanuatu )దేశాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా సమోవా దేశ బాటర్ డేరియస్ విస్సేర్ ( Darius Visser ) ఒకే ఓవర్ లో ఆరు సిక్సులు బాదాడు. అయితే వరుసగా ఆరు సిక్సులు కొట్టలేదు.

దేశాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా సమోవా దేశ బాటర్ డేరియస్ విస్సేర్ ఒకే ఓవర్ లో ఆరు సిక్సులు బాదాడు. అయితే వరుసగా ఆరు సిక్సులు కొట్టలేదు.

ఇన్నింగ్స్ లోని 15వ ఓవర్ ను వనువాటు బౌలర్ నిలిన్ నిపికో ( Nalin Nipiko ) వేసాడు. ఈ ఓవర్ లో 6 సిక్సులు, 3 నో బాల్స్ తో ఒకే ఓవర్ లో 39 పరుగులు బాదాడు సమోవా బాటర్ డేరియస్.

ఇంటర్నేషనల్ క్రికెట్ లో యువరాజ్ కాకుండా కిరణ్ పొలార్డ్, నికోలస్ పూరన్, దీపేంద్ర సింగ్ మాత్రమే 36 పరుగులు సాధించారు. 2007 టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్ లో ఆరు బాల్లకు యువరాజ్ ఆరు సిక్సులు బాధిన విషయం తెల్సిందే.

You may also like
bcci
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. రూ. ఎన్ని కోట్లంటే!
నితీష్ హ్యాట్రిక్..ఆర్సీబీ కెప్టెన్ డకౌట్
అభిషేక్ శర్మ అంటే పాకిస్థానీలకు పిచ్చి..ఎంతలా వెతికారంటే!
SRH నుంచి బయటకు..క్లారిటీ ఇచ్చిన నితీశ్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions