Saturday 21st March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కూటమిలో 4వ భాగస్వామిగా పోలీసులు.. అంబటి సంచలన వ్యాఖ్యలు!

కూటమిలో 4వ భాగస్వామిగా పోలీసులు.. అంబటి సంచలన వ్యాఖ్యలు!

ambati rambabu

Ambati Rambabu | Andhra Pradesh ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష కూటమి నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. పోలింగ్ (Polling) రోజు నుండి మొదలు ఇప్పటి వరకు వైసీపీ, టీడీపీ (TDP) శ్రేణులు మధ్య క్షేత్రస్థాయిలో తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న విషయం తెల్సిందే.

ముఖ్యంగా పల్నాడు(Palnadu), తాడిపత్రి (Tadipathri), తిరుపతి (Tirupathi)లో హింసాకాండ చెలరేగుతుంది. అయితే ఈ ఘర్షణలకు కారణం ప్రత్యర్థి పార్టీయే అని ఇరు పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. పోలీసుల సహకారంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

పోలింగ్ రోజు పోలీసు ఉన్నతాధికారులు కూటమికి అనుకూలంగా వ్యవహరించారని ఇప్పటికే  పలుమార్లు విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు.

ఇందులో భాగంగా ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేసారు. ” కూటమిలో  4 వ పార్టనర్ గా పోలింగ్ రోజున AP పోలీస్ చేరి ఫైట్ చేసినా జగన్ అన్నదే విజయం !” అని అంబటి ధీమా వ్యక్తం చేశారు.

You may also like
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!
ttd
తిరుమల క్యూ లైన్ లో ఫైట్..స్పందించిన టీటీడీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions