Telangana Budget 2024-25 | తెలంగాణ అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతూ స్వేచ్ఛను సాధించుకున్నారని తెలిపారు.
సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే విధంగా బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. గత పాలకుల నిర్వాకం తో ధనిక రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకోతున్నట్లు చెప్పారు. బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి.
– ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా.
– పరిశ్రమల శాఖ 2543 కోట్లు.
– ఐటి శాఖకు 774కోట్లు.
– పంచాయతీ రాజ్ 40,080 కోట్లు.
– పురపాలక శాఖకు 11692 కోట్లు.
– మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు.
– వ్యవసాయ శాఖ 19746 కోట్లు. 🔸ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250 కోట్లు.
– ఎస్సి సంక్షేమం 21874 కోట్లు.
– ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు.
– మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు.
– బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.
– బీసీ సంక్షేమం 8 వేల కోట్లు. 🔸విద్యా రంగానికి 21389 కోట్లు.
– తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.
– యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు.
– వైద్య రంగానికి 11500 కోట్లు.
– విద్యుత్ – గృహ జ్యోతికి 2418 కోట్లు.
– విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
– గృహ నిర్మాణానికి 7740 కోట్లు. – నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు.