Monday 4th May 2026
12:07:03 PM
Home > తాజా > సీఎం జనాల్లో ఉండటం కన్నా గొప్ప కార్యక్రమం ఏముంటుందని వ్యాఖ్య

సీఎం జనాల్లో ఉండటం కన్నా గొప్ప కార్యక్రమం ఏముంటుందని వ్యాఖ్య

He commented that what could be a greater program than the presence of the CM in the crowd

-రేవంత్ ప్రజాదర్బార్ నిర్వహించడం గొప్ప నిర్ణయమన్న మోత్కుపల్లి
-చెప్పిన విధంగానే రేవంత్ ప్రజల్లోకి వచ్చారని ప్రశంస

ప్రజానాయకులు ప్రజల్లో ఉండాలని, ప్రజలతో మమేకం కావాలని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డికి తాను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని… ప్రజలను కలవాలని రేవంత్ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్పదని అన్నారు. ఇలాంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తారని, ఇది తమ ప్రభుత్వం అని భావిస్తారని చెప్పారు. సీఎం స్వయంగా కూర్చొని సమస్యలను పరిష్కరించడం సంతోషకరమని అన్నారు.
ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలతోనే తాను ఉంటానని రేవంత్ చెప్పారని… చెప్పిన విధంగానే ఆయన ప్రజల్లోకి వచ్చారని చెప్పారు. జనాల్లో సీఎం ఉండటం కంటే గొప్ప కార్యక్రమం ఏముంటుందని ప్రశ్నించారు. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని చెప్పారు. ప్రజాదర్బార్ సందర్భంగా ఈరోజు ప్రజాభవన్ కు మోత్కుపల్లి వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions