Friday 18th September 2026
12:07:03 PM
Home > తెలంగాణ > ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Karnataka CM Siddaramaiah stuck in traffic

హైదరాబాద్‌: తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డిమరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాద్ర, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సుఖు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో సిద్ధరామయ్య ఎల్బీ స్టేడియానికి వస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమనేతలతో కూడిన కాన్వాయ్‌ బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్‌ నుంచి ఎల్బీ స్టేడియానికి ప్రారంభమైంది. దీంతో అసెంబ్లీ కూడలిలో పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అదే సమయంలో సిద్ధరామయ్య కాన్వాయ్‌ రవీంద్రభారతి కూడలికి చేరుకున్నారు. రెడ్‌ సిగ్నల్‌ పడటంలో ఆయన ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు.

You may also like
ఆయన వన్ టైం వండర్.. సీఎం రేవంత్ పై సంజయ్ బారు కీలక వ్యాఖ్యలు!
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
తెలంగాణలో వారికి కూడా పెన్షన్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions