Thursday 5th November 2026
12:07:03 PM
Home > తెలంగాణ > సీఎంలకు ఢిల్లీలో అధికారిక నివాసాలను కేటాయిస్తున్న కేంద్రం

సీఎంలకు ఢిల్లీలో అధికారిక నివాసాలను కేటాయిస్తున్న కేంద్రం

Center alloting official residences to CMs in Delhi

-2004 నుంచి తుగ్లక్ రోడ్ లో కేసీఆర్ కు అధికారిక నివాసం
-ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్న కేసీఆర్
-ఇప్పుడు మాజీ సీఎం కావడంతో అధికార నివాసాన్ని ఖాళీ చేస్తున్న కేసీఆర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లో ఉన్న అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. 2004లో టీఆర్ఎస్ తరపున కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన కేసీఆర్. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయనకు తుగ్లక్ రోడ్ లో టైప్ 8 క్వార్టర్ ను కేటాయించారు. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నిర్వహించిన ఉపఎన్నికలో మళ్లీ ఎంపీగా గెలుపొంది అదే నివాసంలో కొనసాగారు. 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికై అదే నివాసంలోనే ఉన్నారు. 2014లో సీఎం అయిన తర్వాత అదే క్వార్టలోనే కొనసాగారు. ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అధికారిక నివాసాలను కేటాయిస్తుంది. ఈ క్రమంలో సీఎంగా ఉన్న కేసీఆర్ కు కేంద్రం అదే నివాసాన్ని కేటాయింది. ఆ తర్వాత ఎంపీగా గెలుపొందిన కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఆ నివాసంలో ఉన్నారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడంతో సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అధికార నివాసాన్ని కేసీఆర్ ఖాళీ చేయబోతున్నారు.

You may also like
TG: ‘అర్నబ్’ తుపాను కల్లోలం: 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions