Sunday 14th June 2026
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్ ఘన విజయం.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!

కాంగ్రెస్ ఘన విజయం.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!

revanth reddy

Revanth Reddy Pressmeet | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అఖండ విజయం సాధించింది. దాదాపు 65 స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతూ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీ భవన్ వద్ద  మీడియాతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ ప్రజా భవన్ గా మారుస్తామని ప్రకటించారు.

ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు.. ప్రజా భవన్ అని తెలిపారు. సామాన్యులకు అందులో ప్రవేశం ఉంటుందని చెప్పారు.

పరిపాలన ఇక గతంలోలా ఉండబోదనీ, సచివాలయ గేట్లు సామాన్యులకు తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు.

ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
revanth reddy
‘హైదరాబాద్ చెరువులకు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions