Friday 31st July 2026
12:07:03 PM
Home > తెలంగాణ > ‘మళ్ళీ కేసీఆర్ వస్తే ఆ 30 లక్షల మంది అడవి బాట పడతారు’

‘మళ్ళీ కేసీఆర్ వస్తే ఆ 30 లక్షల మంది అడవి బాట పడతారు’

Revanth Reddy News| టీపీసీసీ ( TPCC ) చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సంచలన వ్యాఖ్యలు చేసారు. మంగళవారం స్టేషన్ ఘనపూర్ ( Station Ghanpur ) నియోజకవర్గం లో కాంగ్రెస్ విజయ భేరి సభలో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ( Thatikonda Rajaiah ), పోటీ చేస్తున్న కడియం శ్రీహరి ( Kadiyam Srihari )ల గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదన్నారు.

ఆయన రాజయ్యనా లేక కృష్ణయ్యనా ఎంటో తనకు తెలిదంటూ ఎద్దేవా చేశారు రేవంత్. ఇక్కడ ఉన్న ఇద్దరు బీఆరెస్ నేతలు డెప్యూటీ సీఎం లుగా పనిచేసి ఉద్యోగాలు ఊడగొట్టుకున్నవారేనని తెలిపారు.

అలాగే బిల్లులు రాక సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ దద్దమ్మ దయాకర్ ( Daykar ) మంత్రి హోదాలో ఉండి సర్పంచులను ఖాళీ సీసాలు అమ్ముకోమన్నాడని ధ్వజమెత్తారు టీపీసీసీ చీఫ్.

కేసీఆర్ హయాంలో ఉద్యోగాల కోసం 30 లక్షల మంది యువత పోరాటం చేసి అలసిపోయారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ వస్తే ఉద్యోగాలు రాని యువత ( Youth ) అడవిలో అన్నలుగా మారే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.

You may also like
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనమా..? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions