Oommen chandy passes away
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, అపారమైన ప్రజాదరణ పొందిన నాయకుడు ఊమెన్ చాందీ(Oommen chandy) 79వ ఏట కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగుళూరు(bangalore) లోని బెర్లిన్స్ చారిటీ (berlins charity) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని చాందీ తనయుడు చాందీ ఊమ్మెన్ ఫేసుబుక్ (facebook) ద్వారా ప్రకటించారు.
ఊమ్మెన్ చాందీ మరణం పట్ల రాజకీయ నేతలు, కార్యకర్తలు, చాందీ అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాందీ కొట్టాయం జిల్లాలోని పూతుపల్లి(puthupally) నియోజకవర్గానికి 12 సార్లు ప్రాతినిధ్యం వహించారు.
Chandy political legacy| చాందీ రెండుసార్లు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆగస్టు 31, 2004 నుండి మే 12, 2006 వరకు మరియు మే 18, 2011 నుండి మే 20, 2016 వరకు కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) తరపున ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించారు.
అలాగే కె. కరుణాకర్, ఏకే ఆంటోనీ హయాంలో ఆర్ధిక, హోం, కార్మిక శాఖ మంత్రి గా పనిచేశారు.
ఊమ్మెన్ చాందీ 31 అక్టోబర్ 1943 లో కేరళలో జన్మించారు. విద్యార్థిదశ నుండే చాందీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.
చాందీ 1970లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్(president) గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగ సంగం అయిన INTUC లో క్రియాశీలక పాత్ర పోషించారు.
చాందీ మొదటి సారి 1970లో కేరళ శాసనసభకు ఎన్నికయ్యారు. ఐదు దశాబ్దాల పాటు పూతుపాళ్లు నియోజకవర్గానికి చాందీ ప్రాతినిధ్యం వహించారు.
చమత్కారమైన రాజకీయవేత్త, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విధేయుడిగా చాందీ కొనసాగారు. జనాల్లో కూడా విపరీతమైన ఆదరణ పొందాడు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ‘మాస్ కాంటాక్ట్’(mass contact) కార్యక్రమాన్ని రూపొందించారు.
ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ ఎఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ(general secretary) గా ఉన్నారు.
ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, కేరళ సీఎం పినరయి విజయన్ చాందీ మరణం పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.