Ponnala hot comments on congress
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ లో ఉంది.కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు కాంగ్రేస్ పార్టీకి కలిసి వచ్చాయి.
ముఖ్యంగా కర్ణాటకలో ఓటమి తర్వాత బీజేపీ నిరాశ, నిస్పృహలతో స్తబ్దుగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేరికలతో కళకళలాడుతోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం, జూపల్లి కృష్ణరావు త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అందర్నీ కలుపుకొని అధికారమే లక్ష్యంగా ముందుకు పోతుంది.
ఇలాంటి సమయంలో మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
పొన్నాల ఏమన్నారు..
పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ ఇతర పార్టీలో గెలిచినట్టుగా బీసీలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు గెలవడం లేదు అని ఆయన విమర్శించారు.అలాగే ఈ విషయంలో అధిష్టానం ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే బీసీల మద్దతు అవసరం. ఎందుకంటే జనాభాలో మెజారిటీ ప్రజలు బీసీలే అని పొన్నాల వ్యాఖ్యానించారు.
ఈరోజు తెలంగాణ ఓబీసీ నాయకులు పొన్నాల ఇంట్లో భేటీ అయ్యారు.తెలంగాణలో ప్రతి పార్లిమెంట్ పరిధిలో కనీసం 2-3 అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయించాలని ఈ భేటీలో పాల్గొన్న నాయకులు అన్నారు.
గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులలో ఆత్మవిశ్వాసాన్ని నింపలేదని అందుకే ఓబీసీలు ఇతర పార్టీలో గెలిచారూ కానీ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన వారు ఓడిపోయారు అని వారు వ్యాఖ్యానించారు.
ఇకనైనా కాంగ్రెస్ నాయకత్వం బీసీలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని అలాగే వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని పొన్నాల లక్ష్మయ్య కోరారు.