Tuesday 15th September 2026
12:07:03 PM
Home > తెలంగాణ > ఈటెల హత్యకు కుట్ర.. రాజేందర్ సతీమణి జమున సంచలన ఆరోపణలు!

ఈటెల హత్యకు కుట్ర.. రాజేందర్ సతీమణి జమున సంచలన ఆరోపణలు!

Eatala Jamuna

Eatala Jamuna Pressmeet | బీజేపీ నేత చేరికల కమిటీ అధ్యక్షుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ (Eatala Rajender) సతీమణి ఈటెల జమున మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా హుజురాబాద్ బీఆరెస్ నాయకుడు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ హత్యకు కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) కుట్ర పన్నినట్లు ఆరోపించారు.

తన భర్తకు కానీ తనకు కానీ లేదా తమ పిల్లకు ఏమైనా, మా శరీరాల నుండి ఒక్క రక్తపు బొట్టు బయటకి వచ్చిన అది కేసీఆర్ గారి బాధ్యతనే  అని ఈటెల జమున అన్నారు.

రూ. 20 కాదు 40 కోట్లు అయిన సరే ఈటల రాజేందర్ ను చంపిస్తానంటూ కౌశిక్ రెడ్డి అన్నట్లు తెలిసిందని జమున తెలిపారు.      

ఈటలను చంపెస్తామంటే మేం భయపడటం లేదన్నారు. కౌశిక్ రెడ్డి మాటల వెనక సీఎం కేసీఆర్ ఉన్నట్లు ఆమె ఆరోపించారు.

ఈటల బీఆరెస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఆయనపైకి కౌశిక్ రెడ్డిని కేసీఆర్ (KCR) ఉసిగొల్పారని వ్యాఖ్యానించారు.

కౌశిక్ రెడ్డి ఈటలకు వ్యతిరేకంగా హుజూరాబాద్ లో అరాచకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

హుజురాబాద్ (Huzurabad) లో ఒక శిలాఫలకం పై ఈటెల పేరు ఉండటాన్ని సహించలేని కౌశిక్ రెడ్డి అమరవీరుల స్తూపాన్ని జేసీబీతో కూల్చివేసాడని ఆమె ఆరోపించారు.

శిలాఫలకంపై పేరునే సహించలేని వీళ్లు మనిషిని ఏమైనా చెయ్యగలరు అని ఆవేదన చెందారు.

ఈటెల రాజేందర్ బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అయితే ఆయన పార్టీ మారబోనని స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు. 

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions