Monday 14th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > చాహల్-ధనశ్రీ విడాకులు..భరణం కింద రూ.60 కోట్లు?

చాహల్-ధనశ్రీ విడాకులు..భరణం కింద రూ.60 కోట్లు?

Yuzvendra Chahal Dhanashree Verma Divorce Case | క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడాకులకు సంబంధించి నెట్టింట్లో జోరుగా చర్చ నడుస్తోంది. వీరి విడాకుల కేసు ముంబయి ( Mumbai ) బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టు ( Family Court )లో విచారణ జరుగుతుంది.

అయితే గురువారం తుది విచారణ జరిగినట్లు తెలుస్తోంది. చాహల్ ధనశ్రీ వ్యక్తిగతంగా విచారణకు హాజరై సుమారు 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ లో కూడా పాల్గొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అయినప్పటికీ వారు విడిపోవడానికే మొగ్గుచూపుతున్నారని సమాచారం. మరోవైపు చాహల్ తో విడాకుల నేపథ్యంలో భరణం కింద ధనశ్రీ రూ.60 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ధనశ్రీ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

వ్యక్తిగత కారణాలతోనే వారు విడాకులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కానీ భరణం తాము డిమాండ్ చేయలేదని, అటువైపు నుండి కూడా భరణం టాపిక్ చర్చకు రాలేదని ధనశ్రీ కుటుంబ సభ్యులు వస్తున్న వార్తలను ఖండించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions