Sunday 2nd August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుపతి తొక్కిసలాట..పేదల ప్రాణాలు కదా అందుకే పట్టించుకోలేదు

తిరుపతి తొక్కిసలాట..పేదల ప్రాణాలు కదా అందుకే పట్టించుకోలేదు

YSRCP Fires On Cm Chandrababu Over Tirupati Stampede Incident | తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనంకోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయి ఆరోపణలు చేసింది వైసీపీ. విజయవాడలో బుడమేరుకు వరదలు వస్తాయని ముందే తెలుసు.. కానీ మునిగిపోయేది సామాన్య జనం కదా చర్యలు తీసుకోలేదు… తిరుపతిలో తొక్కిసలాట జరుగుతుందని సమాచారం ఉంది కానీ పేదల ప్రాణాలు కదాని ప్రభుత్వం పట్టించుకోలేదని జగన్ పార్టీ విమర్శించింది.

ఇదీ మన గుడ్డి విజనరీ చంద్రబాబు పాలన అని మండిపడింది. సిగ్గుండాలి.. దీనికేనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఎలివేషన్లు ఇచ్చుకుంటారని ఎద్దేవా చేసింది.

ఎన్నివేలమంది భక్తులు వచ్చినా సాఫీగా అందరికీ వెంకన్న దర్శనం కల్పించడంలో తిరుపతికి దేశవ్యాప్తంగా పేరుందని అలాంటి చోటనే టోకెన్లు ఇవ్వలేక, నిర్లక్ష్యంతో తొక్కిసలాట జరిగేలా చేసి ఇప్పటివరకు 48 మందికిపైగా గాయాలు, ఏడుగురి ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఈ కూటమి చవటలు మున్ముందు రాష్ట్రాన్ని ఇంకెటు తీసుకెళ్తారో అంటూ వైసీపీ పోస్ట్ చేసింది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions