Sunday 2nd August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పాదయాత్ర పై జగన్ సంచలన ప్రకటన

పాదయాత్ర పై జగన్ సంచలన ప్రకటన

YS Jagan Padayatra | మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు మరో మూడేళ్ళ సమయం ఉందని, ఈ క్రమంలో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెట్టి ఎన్నికల వరకు తాను ప్రజల మధ్యలోనే వారితో మమేకం అవుతానని జగన్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలతో జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాదయాత్ర పై ప్రకటన చేశారు.

ఇకనుండి ప్రతీ వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. నేడు కూటమి పాలన చాలా అన్యాయంగా సాగుతుందని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో అతిపెద్ద కుంభకోణానికి తెర తీశారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు ‘ప్రజా సంకల్పయాత్ర’ తో రాష్ట్రవ్యాప్తంగా 3,600 కి.మీ. మేర పాదయాత్ర చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 151 సీట్లతో జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన విషయం తెల్సిందే.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions