Tuesday 11th August 2026
12:07:03 PM
Home > తాజా > Megastar చిరంజీవి సినిమాకు నో చెప్పిన టాలీవుడ్ యంగ్ హీరో?

Megastar చిరంజీవి సినిమాకు నో చెప్పిన టాలీవుడ్ యంగ్ హీరో?

Chiranjeevi

Bro Daddy Remake | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవల వరస సినిమాలు చేస్తున్నారు. గతేడాది ఏకంగా మూడు చిత్రాలు విడుదలయ్యయి. ప్రస్తుతం మరో రెండు మూడు సినిమాలు క్యూలో ఉన్నాయి.

మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. తమిళ సినిమా వేదాళం రీమేక్ గా వస్తున్న ఈ ఏ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 11న విడుదల కానుంది.

సినిమాలో కీర్తి సురేశ్ (Keerthy Suresh) చిరుకి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా (Tammannaah) చిరు సరసన హీరోయిన్ గా ఆడిపాడనుంది.

భోళా చిత్రం డబ్బింగ్ కూడా పూర్తవడంతో చిరంజీవి ఇటీవలే ఆయన భార్య సురేఖతో కలిసి అమెరికా వెకేషన్ కి వెళ్లారు.

Read Also: లిక్కర్ కేస్ తర్వాత మళ్లీ యాక్టివ్.. రంగంలోకి దిగిన కవిత!

కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చిన వెంటనే ఆయన మరో సినిమా మొదలెట్టనున్నారు.

నాగార్జున బంగార్రాజు ఫేం కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna) దర్శకత్వంలో చిరు తన తర్వాతి చిత్రం చేయనున్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇది కూడా రీమేక్ సినిమా అని ప్రచారం సాగుతోంది. మోహన్ లాల్, పృథ్వి రాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించి మలయాళ చిత్రం బ్రోడాడీకి రీమేక్ గా సినిమాను తెరకెక్కిస్తారని టాలీవడ్ లో ప్రచారం అవుతోంది.

ఈ మూవీలో నటీనటులను కూడా ఫైనల్ చేసినట్టు రూమర్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి పక్కన డీజే టిల్లు (DJ Tillu) ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ (siddu jonnalagadda), వీరదిద్దరికీ జోడీగా త్రిష (Trisha), శ్రీలీల (Srileela)ను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ ప్రచారం అవుతోంది.

అయితే సిద్దు జొన్నలగడ్డ ఈ ప్రాజెక్ట్ ను తిరస్కరించారని తెలుస్తోంది.

ఇప్పుడిప్పుడే లీడ్ రోల్స్ చేస్తూ హీరోగా ఎదుగుతున్న క్రమంలో సపోర్టింగ్ రోల్ చేయడం సరికాదని ఆయన భావిస్తున్నారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ టాలీవడ్ సర్కిళ్లలో ప్రచారం అవుతుంది.  

You may also like
సోషల్ మీడియా ట్రోల్స్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..!
rajendra prasad
క్షమాపణలు చెప్పండి.. ఇంతటితో ముగించండి!
pramodh shetty
రష్మిక తన పెళ్లికి మమ్మల్నిపిలవదని తెలుసు: ప్రమోద్ శెట్టి
chiranjeevi
నా విజయ రహస్యం నువ్వే అని చెబుతా.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions