One Nation-One Election | బీజేపీ (BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలకు (Jamili Elections) సంబంధించి ఓ ముందడుగు వేసింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ (One Nation – One Election) ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్ర ష్ట్రతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు మోదీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని మంగళవారం కేంద్రహోం మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. కాగా, వన్ నేషన్-వన్ ఎలక్షన్ ను కాంగ్రస్ వ్యతిరేకిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని అధ్యయనానికి మాజీ రాష్ట్ర పష్ట్ర తిరామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గత ఏడాది సెప్టెం బర్లో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటుచేసింది.
సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేసిన కమిటీ ప్రజల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించింది. పూర్తి సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇటీవలే కేంద్రానికి నివేదికను సమర్పించింది.