TTD Chairman BR Naidu News | జనవరి 8వ తారీఖున అత్యంత దురదృష్టవంతమైన సంఘటన జరిగిందన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.
ఈ మేరకు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. తొక్కిసలాత ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు, గాయపడిన వారికి సీఎం అదేశాల ప్రకారం పరిహారం అందజేసినట్లు పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో టీటీడీ పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, తిరుమల అనేది కోట్లాది మంది హిందువులు మనోభావాలకు సంభందించిన విషయమని తెలిపారు.
వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటిరెండు సార్లు పరిశీలించాలని కోరారు. మీడియా చేతిలో ఉందని ఇష్టానుసారం అసత్య వార్తలు , ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు.
పాలకమండలి కి…అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలను టీటీడీ ఛైర్మన్ తీవ్రంగా ఖండించారు. తొక్కిసలాట సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని వెల్లడించారు.