Sunday 14th June 2026
12:07:03 PM
Home > తెలంగాణ > కేటీఆర్ బుద్ధిగా పనిచేయ్: మంత్రి సీతక్క ఫైర్!

కేటీఆర్ బుద్ధిగా పనిచేయ్: మంత్రి సీతక్క ఫైర్!

seethakka ktr

Seethakka Slams KTR | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై మంత్రి సీతక్క (Seethakka) ఫైర్ అయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటమితో కేటీఆర్ మైండ్ బ్లాంక్ అయిందని, వారి అహంకారమే బీఆరెస్ ను ఓడించిందని విమర్శలు గుప్పించారు.

అధికారం లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారని అందుకే విధ్వంసకర రాజకీయాలకు తెర తీస్తున్నారంటు దుయ్యబట్టారు.

గురువారం శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్న సీతక్క అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. బీఆరెస్ పాలనలో లక్షల కోట్ల అప్పులు చేసి విలాసవంతమైన జీవితాన్ని గడిపారని, గడిలా పాలన చేశారని మండిపడ్డారు.

కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదని గుర్తుచేశారు. అలాగే ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారని పేర్కొన్నారు. సర్పంచులు బిల్లులను పెండింగ్ లో పెట్టి, నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.

అంతేకాకుండా సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తే కేటీఆర్ జీర్ణించికోలేకపోతున్నారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు కేటీఆర్ కు బుద్ధి ఉందా అంటూ ప్రశ్నించారు. ఇకనైనా కేటీఆర్ ప్రతిపక్ష హోదాలో బుద్దిగా పనిచేయాలని హితవుపలికారు.

You may also like
minister seethakka
మహిళా సంఘాలకు సర్కార్ తీపి కబురు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్!
tg police wins
ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన తెలంగాణ పోలీస్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions