Friday 1st May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రైలు పట్టాలపై PUBG..ముగ్గురు యువకుల దుర్మరణం

రైలు పట్టాలపై PUBG..ముగ్గురు యువకుల దుర్మరణం

Trains Runs Over Three Teens Playing PUBG On Railway Track In Bihar | రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ( PUBG ) ఆడుతూ పరధ్యానంగా ఉండడం వల్ల ముగ్గురు యువకులు తమ ప్రాణాల్ని కోల్పోయారు.

ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పశ్చిమ చంపారన్ ( Wesr Champaran ) జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు నార్కటియాగంజ్-ముజఫర్పూర్ ( Narkatiaganj-Muzaffarpur ) మార్గంలోని పట్టాలపై కూర్చుని పబ్జీ ఆడుతున్నారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన రైలు వారిని ఢీ కొట్టి పైనుండి దూసుకెళ్లింది.

పబ్జీ ఆడుతూ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం మూలంగా యువకులు తమవైపు వస్తున్న రైలును గమనించకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

మృతులను ఫర్కాన్ ఆలం, సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీగా గుర్తించారు. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఉన్న సమయంలో పరధ్యానంగా ఉండకూడదని పోలీసులు సూచిస్తున్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions