Friday 31st July 2026
12:07:03 PM
Home > తాజా > ఇవేం దిక్కుమాలినపనులు.. బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్లపై సజ్జనార్ ఫైర్!

ఇవేం దిక్కుమాలినపనులు.. బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్లపై సజ్జనార్ ఫైర్!

Sajjanar

Sajjanar Fires on Betting Apps Promoters | తెలంగాణ ఆర్టీసీ ఎండీ (TGSRTC MD) వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఆర్టీసీ విధుల నిర్వహణతోపాటు సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. ముఖ్యంగా యువతను ఉద్దేశించి తరచూ పోస్టులు చేస్తుంటారు.

తాజాగా ఓ వ్యక్తి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం చేసిన వీడియోపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపై తీవ్రంగా మండిపడ్డారు.

“మీరు డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఇవేం దిక్కుమాలినపనులు. మీ టాలెంట్ ను ఇతరత్రా రంగాల్లో ఉపయోగించుకుని సంపాదించుకోవడంలో తప్పులేదు. అలా చేస్తే మిమ్మల్ని సమాజం హర్షిస్తోంది.

ఇలాంటి పనుల ద్వారా ఎంతో మందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేయడం ఎంత వరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లమనీ, మేం ఏం చేసిన నడుస్తుందనే భ్రమలో ఉండకండి. చట్టప్రకారం మీకు శిక్షలు తప్పవని గుర్తుంచుకోండి.

ఇప్పటికైనా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్లను ఆపండి” అంటూ పోస్ట్ చేశారు సజ్జనార్.

https://twitter.com/SajjanarVC/status/1892430468689113561

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions