Friday 31st July 2026
12:07:03 PM
Home > తాజా > రూ.3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

రూ.3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

Telangana Budget 2025 Updates | తెలంగాణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.

2025-26 వార్షిక సంవత్సరం కోసం రూ.3,04,965తో బడ్జెట్ ను సభ ముందుకు తీసుకువచ్చారు. రెవెన్యూ వ్యయం ₹2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు.

జోడు గుర్రాల తరహా పరిపాలన అందిస్తున్నట్లు, అంబేద్కర్‌ స్పూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో భట్టి తెలిపారు. దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిణామం 200 బిలియన్‌ డాలర్లు, రాబోయే ఐదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్‌ డాలర్లు ఉండేలా కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు.

శాఖల వారిగా కేటాయింపుల విషయానికి వస్తే..
₹40,232 కోట్లు – షెడ్యూల్డ్ కులాల సంక్షేమం
₹31,605 కోట్లు – పంచాయతీరాజ్ & గ్రామీణం
₹24,439 కోట్లు – వ్యవసాయం
₹23,373 కోట్లు – నీటిపారుదల
₹23,108 కోట్లు – విద్య
₹21,221 కోట్లు – ఇంధనం
₹17,677 కోట్లు – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
₹17,169 కోట్లు – షెడ్యూల్డ్ తెగల సంక్షేమం
₹12,393 కోట్లు – ఆరోగ్యం
₹11,405 కోట్లు – వెనుకబడిన తరగతుల సంక్షేమం
₹5,907 కోట్లు – రోడ్లు & భవనాలు
₹5,734 కోట్లు – పౌర సరఫరాలు
₹3,591 కోట్లు – మైనార్టీ సంక్షేమం
₹3,527 కోట్లు – పరిశ్రమలు
₹2,862 కోట్లు – మహిళలు మరియు శిశు సంక్షేమం
₹1,674 కోట్లు – పశుసంవర్ధకం
₹1,023 కోట్లు – అడవులు & పర్యావరణం
₹900 కోట్లు – యువజన సేవలు

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions