Telangana BJP Mps And MLAs Meets Pm Modi | ఓ వైపు పార్లమెంటు సమావేశాలు మరోవైపు మహారాష్ట్ర ( Maharashtra ) ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ పరిస్థితులు.. ఇలాంటి సమయంలో తెలంగాణ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో ప్రధాని మోదీ భేటీ అవ్వడం ఆసక్తిగా మారింది.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో జోష్ లో ఉన్న బీజేపీ తెలంగాణలో కూడా దూకుడు పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ ఎంపీ, ఒక ఎమ్మెల్సీ బుధవారం ప్రధానిని కలిశారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. అలాగే ఈ విదంగా ముందుకు వెళ్లాలో నేతలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy ) నేతృత్వంలోని ప్రతినిధి బృందం… కీలకమైన రాష్ట్ర సమస్యలు, తెలంగాణలో పార్టీ భవిష్యత్తు అవకాశాలపై చర్చించింది.
తెలంగాణకు చెందిన 18 మంది బిజెపి ప్రతినిధులు ప్రధానమంత్రితో సమావేశం కావడం రాష్ట్ర అభివృద్ధి పథాన్ని బలోపేతం చేయడం మరియు కీలకమైన ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడంపై తమ పార్టీ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.