Monday 9th December 2024
12:07:03 PM
Home > క్రీడలు > నితిన్ సినిమాలో డేవిడ్ వార్నర్..మేకర్స్ ఏమన్నారంటే !

నితిన్ సినిమాలో డేవిడ్ వార్నర్..మేకర్స్ ఏమన్నారంటే !

David Warner In Telugu Movie | ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ( David Warner ) కు తెలుగు సినిమాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా పుష్ప మూవీ ( Pushpa Movie )కి సంబంధించి పలు రీల్స్ లో వార్నర్ యాక్ట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

దింతో సదరు వీడియోలు తెగ వైరల్ గా మారాయి. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నారని ప్రచారం జరిగింది. నితిన్ ( Nitin ), శ్రీలీల ( Sreeleela ) కాంబోలో వెంకీ కుడుముల రాబిన్ హుడ్ ( Rabinhood ) అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో డేవిడ్ వార్నర్ కెమియో చేయనున్నట్లు కథనాలు వచ్చాయి.

బుధవారం ఈ సినిమాకు సంబంధించి తొలి సాంగ్ విడుదలయ్యింది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ పాత్రపై జర్నలిస్టులు ప్రశ్నించారు. వార్నర్ పాత్ర ఎలా ఉండబోతుంది, ఈ ఛాయిస్ ఎవరిది అని వారు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వెంకీ కుడుముల స్పందిస్తూ సమయం వచ్చినప్పుడు చెబుతాం అంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు.

You may also like
ktr
‘సీఎం రేవంత్.. తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం?’ : కేటీఆర్
manchu family
మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది.. మోహన్ బాబు ఇంటికి బౌన్సర్లు?
allu amitabh
‘ఐకాన్ స్టార్ మేమంతా మీ అభిమానులమే’: అమితాబ్ బచ్చన్
ponnam prabhakar
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. కేసీఆర్ కు మంత్రి ఆహ్వానం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions