Wednesday 23rd September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సీఎం విజయ్ బర్త్ డే సంబరాలు.. బంగారు ఉంగరాల పంపిణీ!

సీఎం విజయ్ బర్త్ డే సంబరాలు.. బంగారు ఉంగరాల పంపిణీ!

CM Vijay Birthday Celebrations | తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ సోమవారం నాడు తన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తర్వాత వస్తున్న తొలి పుట్టినరోజు కావడంతో తమిళనాడు వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆయన అభిమానులు, టీవీకే పార్టీ నేతలు, శ్రేణులు ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

మిన్నంటిన సేవా కార్యక్రమాలు..

సీఎం విజయ్ బర్త్ డే సందర్భంగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీతో పార్టీ కేడర్ హోరెత్తిస్తోంది.

పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరాలు

ఈ సంబరాల్లో భాగంగా ఒక వినూత్న కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం విజయ్ పుట్టినరోజు నాడే జన్మించిన నవజాత శిశువులకు బంగారు ఉంగరాలను బహుమతిగా అందించారు. తమిళనాడు మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ స్వయంగా తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.

ఈ రోజు ఆసుపత్రిలో జన్మించిన ఆరుగురు నవజాత శిశువులకు ఆయన చేతుల మీదుగా బంగారు ఉంగరాలను తొడిగారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు నాడే తమ పిల్లలు పుట్టడం, అదే సమయంలో ప్రభుత్వ మంత్రి చేతుల మీదుగా బంగారు ఉంగరాలు బహుమతిగా రావడంతో ఆయా కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ ఈ ‘గోల్డ్ రింగ్స్’ పంపిణీ హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions