Monday 22nd June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > శ్రీలీలకు అవమానం?.. సీఎం భార్యపై నెటిజన్ల ఫైర్!

శ్రీలీలకు అవమానం?.. సీఎం భార్యపై నెటిజన్ల ఫైర్!

Sreeleela Amruta Fadnavis Controversy | టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలకు ముంబైలో అవమానం జరిగిందా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ ప్రవర్తన ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శ్రీలీల పట్ల ఆమె వ్యవహరించిన తీరు సరిగ్గా లేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

అసలేం జరిగిందంటే?

ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబైలో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో అమృతా ఫడ్నవీస్, బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు.

కార్యక్రమం విజయవంతంగా ముగిసిన అనంతరం అమృతా ఫడ్నవీస్, ఆమె కుమార్తె మరియు శ్రీలీల కలిసి గ్రూప్ ఫోటోల కోసం మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో అక్కడున్న మీడియా ప్రతినిధులు కొందరు.. అమృత, ఆమె కుమార్తె విడిగా ఉన్న ఫోటోలు కావాలని కోరారు.

చేతి వేళ్లతో సైగ చేస్తూ..!

మీడియా రిక్వెస్ట్ చేయడమే ఆలస్యం.. అమృతా ఫడ్నవీస్ పక్కనే ఉన్న శ్రీలీలను పక్కకు తప్పుకోవాల్సిందిగా కోరారు. అయితే, సాధారణంగా చెప్పకుండా, చేతి వేళ్లతో పక్కకు వెళ్లమంటూ ఆమె చేసిన సైగ ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. అమృత ప్రవర్తించిన తీరుకు ఒక్కసారిగా షాకైన శ్రీలీల.. ఏమీ అనలేక సైలెంట్‌గా పక్కకు తప్పుకుని నిల్చున్నారు.

నెట్టింట విమర్శల పర్వం..

దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు అమృతా ఫడ్నవీస్ శైలిపై విరుచుకుపడుతున్నారు. “ఒక సెలబ్రిటీకి ఇచ్చే గౌరవం ఇదేనా?” అని కొందరు, “అంత అహంకారం పనికిరాదు” అని మరికొందరు నెటిజన్లు కామెంట్ల రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌ పై ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై అటు అమృతా ఫడ్నవీస్ గానీ, ఇటు హీరోయిన్ శ్రీలీల గానీ ఇంకా ఎలాంటి అధికారిక స్పందన తెలియజేయలేదు.

You may also like
sreeleela
నాకు కాబోయే వాడు ఎలా ఉండాలంటే..: నటి శ్రీలీల!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions