Friday 7th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సీఎం అయ్యే అవకాశం వచ్చింది..సోనూసూద్ కామెంట్స్

సీఎం అయ్యే అవకాశం వచ్చింది..సోనూసూద్ కామెంట్స్

Sonu Sood Refused The Post Of A Chief Minister | నటుడు సోనూసూద్ కీలక విషయాలను పంచుకున్నారు. తనకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సీటు ఇలా తనకు గతంలో ఎన్నో ఆఫర్లు వచ్చినట్లు పేర్కొన్నారు.

కరోనా సమయంలో ఎందరికో సహాయం చేసిన సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తారని కథనాలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం పాలిటిక్స్ వైపు ఇప్పటివరకు వెళ్ళలేదు.

అయితే దేశంలో పేరున్న కొందరు నేతలు, పార్టీలు తనకు సీఎం సీటును ఆఫర్ చేశాయని కానీ తాను తిరస్కరించినట్లు చెప్పారు. దింతో డిప్యూటీ సీఎం, లేదంటే రాజ్యసభ సీటు ఇస్తామని వారు చెప్పినట్లు తెలిపారు.

రాజకీయాల్లోకి వస్తే జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఇది తనను భయపెడుతుందని సోనూసూద్ చెప్పారు. డబ్బు సంపాదించుకోవడం లేదా పదవుల కోసం చాలా మంది రాజకీయాల్లోకి వస్తారని కానీ వీటి పట్ల ఆసక్తి లేదన్నారు ఈ నటుడు. ప్రజా సేవ చేయడమే రాజకీయం అయితే ఇప్పుడు తాను సొంత డబ్బులతో అదే చేస్తున్నానన్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions