Monday 14th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఆయనేవరో చెప్పగలరా ?..సచిన్ పోస్ట్ వైరల్

ఆయనేవరో చెప్పగలరా ?..సచిన్ పోస్ట్ వైరల్

Sachin Tendulkar’s Epic Dig At Umpire | మాస్టర్ బ్లాస్టర్ ( Master Blaster ) సచిన్ టెండూల్కర్ తాజగా చేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది. ఆ అంపైర్ ను గుర్తుపట్టండి అంటూ ఆయన ఒక ఫోటోను పోస్ట్ చేశారు.

మూడు పెద్ద చెట్ల ముందు నిల్చొని బ్యాటింగ్ చేస్తున్న ఫోజ్ లో సచిన్ ఒక ఫోటోను దిగారు. దీన్ని ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేస్తూ..ఇంత పెద్ద చెట్లను కూడా స్టంప్స్ గా భావించే అంపైర్ ( Umpire ) ఎవరో గుర్తుపట్టగలరా అంటూ కాప్షన్ ( Caption )ఇచ్చాడు. సచిన్ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ అంపైర్ ఎవరూ అని ప్రశ్నలు వచ్చాయి. ఆయన మరెవరో కాదు వెస్ట్ఇండీస్ ( West Indies ) మాజీ అంపైర్ స్టీవ్ బక్నర్ ( Steve Bucknor ). డిఆర్ఎస్ ( DRS )లేని రోజుల్లో స్టీవ్ బక్నర్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ఓ సమయంలో అయితే సచిన్ బ్యాటింగ్ చేస్తుండగా బాల్ చాలా ఎత్తున ప్యాడ్స్ కు తగిలింది.

అయినప్పటికీ బక్నర్ ఔట్ గా ప్రకటించాడు. బక్నర్ డేసిషన్స్ లో అనేక తప్పులు ఉన్నాయంటూ ఫ్యాన్స్ మండిపడిన రోజులూ ఉన్నాయి. అయితే సచిన్ విషయంలో కొన్ని నిర్ణయాలు తప్పుగా ఇచ్చినట్లు గతంలో బక్నర్ ఒప్పుకున్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions