Vijay Rashmika Combo Again | టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి సిద్ధమయ్యారు. టాలీవుడ్ లో అన్ అఫీషియల్ ప్రేమ పక్షులుగా గుర్తింపు పొందిన ఈ జోడి మరోసారి జత కడుతున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి (Gautham Thinnanuri) డైరక్షన్ లో ‘VD-12′ లో నటిస్తున్నారు. శ్రీలీల (Srileela) హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. కాగా, విజయ్, రాహుల్ సాంకృత్యన్ కాంబోలోనూ ఓ చిత్రం తెరకెక్కనుంది.
‘VD-14’ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా పూర్తయింది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
ఈ క్రమంలో VD-14 మూవీలో హీరోయిన్ కన్ఫర్మ్ అయినట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ గా మారాయి. విజయ్ సరసన మరోసారి రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తున్నట్లు టాక్. ఇది పీరియాడిక్ యాక్షన్ ఫిలిం అని తెలుస్తుంది.
1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథగా, విజయ్ దేవరకొండని ఓ యోధుడిగా చూపించబోతున్నారు అని సమాచారం. ఇప్పటికే విజయ్, రష్మిక గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించిన ఈ జోడికి ప్రేక్షకుల ఆదరణ లభించింది.