Saturday 19th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఢిల్లీ బ్లాస్ట్..బాధితులకు ప్రధాని పరామర్శ

ఢిల్లీ బ్లాస్ట్..బాధితులకు ప్రధాని పరామర్శ

PM Modi meets injured at LNJP Hospital | ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లి బాంబు పేలుడు ఘటన బాధితులను పరామర్శించారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట, చాందీని చౌక్ మధ్య ఉన్న రోడ్డుపై సిగ్నల్ వద్ద జరిగిన కారు బ్లాస్ట్ కలకలం రేపింది.

ఈ ఘటనలో క్షతగాత్రులను ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూటాన్ పర్యటనను ముగించుకుని భారత్ కు బుధవారం తిరిగి వచ్చారు. నేరుగా ఆయన ఆసుపత్రికి వెళ్లి బాధితులను కలిశారు.

వారి పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. అలాగే ఈ కుట్ర వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెట్టడం ఖాయం అని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions