Friday 31st July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > శ్రీరాముడు భారతీయుడు కాదు..నేపాల్ ప్రధాని సంచలనం

శ్రీరాముడు భారతీయుడు కాదు..నేపాల్ ప్రధాని సంచలనం

Nepal PM’s Controversial Statement On Lord Rama Birthplace | నేపాల్ ప్రధానమంత్రి కేపి శర్మ ఒలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

శ్రీరాముడి జన్మస్థలం భారతదేశం కాదని, శివుడు, శ్రీరాముడు, విశ్వామిత్రుడు ప్రస్తుత నేపాల్ దేశ భూభాగంలోనే జన్మించారని వ్యాఖ్యానించారు.

సోమవారం ఆ దేశ రాజధాని కాఠ్మాండ్ లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ప్రధాని కేపి శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..శ్రీరాముడు నేపాల్ చిత్వాన్ లోని థోరిలో జన్మించినట్లు వ్యాఖ్యానించారు. ఇది తాను కల్పితంగా చెప్పడం లేదని వాల్మీక రాసిన అసలైన రామాయణం ఆధారంగానే చెబుతున్నట్లు ఆయన తెలిపారు.

ఈ విషయాన్ని ప్రజలందరూ విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని కేపి శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. శ్రీరాముడు జన్మించిన అయోధ్య నేపాల్ లోని థోరిలో ఉందని, ఇది ఇప్పటికీ తమ దేశంలోనే ఉందన్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions