Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు!

అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు!

allu arjun gets interim bail

Bail For Allu Arjun | సంధ్య థియేటర్ (Sandhya Theatre) ఘటనలో సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun)కు నాంపల్లి కోర్టు (Nampally Court) రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగియగా శుక్రవారం తీర్పు వెలువరించింది.

రూ.50వేల రెండు పూచీకత్తులను సమర్పించాలని, పోలీసుల విచారణకు సహకరించాలని, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని.. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టు అల్లు అర్జున్ తరపు న్యాయవాది తెలిపారు.

‘పుష్ప2′ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. తాజాగా కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

You may also like
Allu Chiru
‘ఇది బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు’
gaddar film awards
గద్దర్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం..ఉత్తమ నటుడు ఎవరంటే!
allu arjun gets interim bail
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. క్రేజీ వీడియో రిలీజ్!
allu arjun
అల్లు అర్జున్ ఖాతాలో మరో ఘనత..

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions