Monday 23rd December 2024
12:07:03 PM
Home > తాజా > కొకైన్ తీసుకుంటావ్.. నీ చరిత్ర మొత్తం తెలుసు..:కేటీఆర్ పై మైనంపల్లి!

కొకైన్ తీసుకుంటావ్.. నీ చరిత్ర మొత్తం తెలుసు..:కేటీఆర్ పై మైనంపల్లి!

Mynampally

Mynampally Hanumanth Rao | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు సంచలన విమర్శలు చేశారు.

మల్కాజిగిరి రోడ్ షో లో తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మైనంపల్లి.

గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తనను కేటీఆర్ గుండా అనడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జోలికి వస్తే కేటీఆర్ చరిత్ర మొత్తం బయటకు తీస్తా అని హెచ్చరించారు.

గల్లీ లో బీజేపీ (BJP)ని తిట్టి ఢిల్లీకి వెళ్లి కాళ్ళు పట్టుకుంటారని విమర్శలు గుప్పించారు. మల్కాజిగిరి, మెదక్ రెండు స్థానాల్లో బీఆరెస్ ఓడిపోతుందనే భయంతోనే తనపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు.

చేతిలో పోలీసులు ఉన్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ పై గరం అయ్యారు. కల్వకుంట్ల కుటుంబం లో అందరూ పోటీ చేయొచ్చు గాని తన కుటుంబంలో ఇద్దరు ఎన్నికల బరిలో నిలవకూడదా అంటూ ప్రశ్నించారు.

కేటీఆర్ కొకైన్ డ్రగ్స్ తీసుకుంటారని, అవసరమైతే వీడియోలతో సహా నిరూపిస్తానని సవాల్ విసిరారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions