Saturday 23rd May 2026
12:07:03 PM
Home > క్రీడలు > CSK ఫ్యాన్స్‌ కు గుడ్ న్యూస్.. ధోనీ ‘రిటర్న్స్’?

CSK ఫ్యాన్స్‌ కు గుడ్ న్యూస్.. ధోనీ ‘రిటర్న్స్’?

CSK

– ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కే ఎంఎస్డీ ఎంట్రీ?

– పీకల్లోతు కష్టాల్లో చెన్నైకి దొరికిన ఆశాకిరణం!

MS Dhoni return in IPL 2026 | ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇలాంటి సమయంలో చెన్నై జట్టుకు,  తమ ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీ రాక అత్యవసరంగా మారింది.

గాయం కారణంగా సీజన్ ఆరంభ మ్యాచులకు దూరమైన ధోనీ, త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ ప్రారంభానికి ముందే ధోనీ గాయపడటంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం మరో రెండు రోజుల్లో ధోనీ కీలకమైన ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొననున్నారు.

ఇందులో ధోనీ పాస్ అయితే, వచ్చే శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తో జరగబోయే కీలక పోరులో ఆయన తుది జట్టులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ధోనీ రాకతో జట్టులో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా, క్లిష్ట సమయాల్లో నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

కేవలం ధోనీ మాత్రమే కాదు, చెన్నై బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేసేందుకు దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రేవిస్ (Dewald Brevis) కూడా జట్టులోకి రానున్నారు. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో బ్రేవిస్ అందుబాటులో ఉంటారని సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ స్వయంగా వెల్లడించారు.

వరుస ఓటములతో డీలా పడిన చెన్నై జట్టుకు ధోనీ అనుభవం, బ్రేవిస్ మెరుపులు తోడైతే మళ్లీ ఫామ్‌లోకి రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. శనివారం జరగబోయే ఈ మ్యాచ్ చెన్నై పాలిట చావో రేవో లాంటిది. మరి ధోనీ మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions