Minister Ponguleti Chit Chat | తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే.. పరిశ్రమలు అక్కడికి తరలి వెళుతున్నాయనే ప్రచారం అవాస్తవం అని కొట్టిపారేశారు. అమరావతిలో వరద వల్ల ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదని.. అక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి 7 లక్షల 20 వేల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. అప్పులపై కేటీఆర్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కార్పొరేషన్ పేరుతో చేసే అప్పులు కూడా ప్రభుత్వం ఖాతాలోకి వస్తాయనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనతో కూర్చొని మాట్లాడాలనే కోరిక తనకు వ్యక్తిగతంగా ఉందన్నారు మంత్రి పొంగులేటి.