Tuesday 16th June 2026
12:07:03 PM
Home > తాజా > ఇది 8 పర్సెంట్ గవర్నమెంట్.. హరీశ్ రావు విమర్శలు!

ఇది 8 పర్సెంట్ గవర్నమెంట్.. హరీశ్ రావు విమర్శలు!

harish rao

Harish Rao Slams Revanth Govt | ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంజల్, జేబీ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామెంట్స్..  తెలంగాణ అమరవీరుల స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఏటా నిర్విహిస్తున్న ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ నాయకుడు నర్సింగరావును అభినందించారు.

“తెలంగాణ అమర వీరుల గురించి ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆలోచిస్తుంది. అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, పది లక్షలు ఇచ్చి అమరులను గౌరవించింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. అమరుల త్యాగం, విద్యార్థులు, కేసీఆర్ కృషి ఫలితం కేసీఆర్. తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ 1 చేశారు కేసీఆర్.

ఐటీ, ఆర్థికం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో కేసీఆర్ నెంబర్ 1 గా నిలిపారు. పదేళ్లలో అగ్రస్థానం, రేవంత్ 11 నెలల పాలనలో అథ:పాతాళానికి తీసుకెళ్లాడు. హైదరాబాద్ చుట్టూ ముడు దిక్కుల సముద్రం అంటడు, దిల్ సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతడు అంటడు.     రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండట. ఇట్ల మాట్లాడుతారు రేవంత్ రెడ్డి. సీఎం మాటలు విని పరీక్షల్లో రాస్తే ఆగమైపోతరు. రాష్ట్రం పరువు తీస్తున్నడు ముఖ్యమంత్రి.

క్రికెట్ లో హిట్ వికెట్ అవుతారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటయి. ఆరు గ్యారెంటీలు బంద్ పెట్టి మూసీ దుకాణం మొదలు పెట్టిండు. 31 ఎస్టీపీలు, 3800 కోట్లతో మూసీ అభివృద్ధిని కేసీఆర్ ప్రారంభించాడు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లను 1100 కోట్లతో మూసీలో పోయాలని ప్లాన్ చేసారు పేదోళ్ల ఇండ్లు కూలగొట్టడమే రేవంత్ హిట్ వికెట్.

మూసీ శుద్ధి చేయాలంటే గోదావరి నీళ్లు తేవాలి. అంతేగాని గరీబోళ్ల ఇల్లు కూలగొడుతరా మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే బీఆర్ఎస్ ఊరుకోదు. ఆరు గ్యారెంటీలు అన్నడు మోసం చేసిండు. పింఛన్లు, విద్య భరోసా కార్డు, ఉద్యోగాలు ఏవీ లేవు. ఆరు గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి డక్ అవుట్. స్కాలర్ షిప్పులు రేవంత్ రెడ్డి గుండు సున్న చేశాడు.

విద్యార్థులకు గాడిద గుడ్డు మిగుల్చావు. ఒక్క విద్యార్థికి స్కాల్ షిప్పుల డబ్బులు ఇవ్వలేదు. డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి సంవత్సరం 20వేల కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ కు ఇచ్చారు. ఏడాది అవుతున్నది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రేవంత్.

ఇది 8పర్సంట్ గవర్నమెంట్. బిల్లులు ఇవ్వాలంటే 8పర్సంట్ ఇవ్వాలట. హైదరాబాద్ ను పెట్టుబడులకు స్వర్గధామం చేసిండు కేసీఆర్. ఇగురం లేనోడు వ్యవసాయం చస్తే వడ్లు వాగు పాటు, గడ్డి గాలి పాలయ్యిందట రేవంత్ రెడ్డి పాలన కూడా అట్లున్నది.

బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఫీల్డింగ్, బౌలింగ్, కీపింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నది. క్రికెట్ లో 11 మంది లాగే మంత్రులు 11  ఉన్నరు. గూగ్లి వేస్తున్నాం. రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ గట్టిగ పోరాటం చేస్తున్నది కాబట్టే పెవిలియన్ దారి పడుతున్నరు. రాబోయే రోజుల్లో మనదే కప్.

కేసీఆర్ ఫుల్ ఫాంలోకి వస్తడు. మల్లీ వచ్చి బీఆర్ఎస్ ను గెలిపిస్తాడు. కేసీఆర్ ఎక్కడ ఉన్నావు అని యాది చేసే కాలం వచ్చింది. గెలిచిన టీమే కాదు, ఓడిపోయిన టీం కూడా బాగా ఆడారు. గెలుపు ఓటములు చాలా సహజం. భవిష్యత్తులో గెలుపు కోసం పోరాటం చేయాలి.

మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా తగ్గించి క్రికెట్, ఫుట్ బాల్, వాలీ బాల్ ఆడండి. శారీరక శ్రమ చేయండి. ఫిజికల్, మెంటల్ ఫిట్ నెస్ కోసం క్రీడలు ఉపయోగపడతాయి. సోషల్ మీడియా తగ్గించి ఆటలు, చదువు మీద దృష్టి పెట్టండి.

You may also like
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions