Saturday 22nd August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మహిళ దుస్తులు లాగడం కూడా అత్యాచార యత్నమే: సుప్రీంకోర్టు!

మహిళ దుస్తులు లాగడం కూడా అత్యాచార యత్నమే: సుప్రీంకోర్టు!

Supreme Court Of India

Supreme Court | మహిళ దుస్తులను పట్టుకొని లాగటం, వక్షోజాలను తాకడం కూడా అత్యాచార యత్నం కిందకు వస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఉత్తర ప్రదేశ్ లో నాలుగేళ్ల కిందట జరిగిన ఓ ఘటనకు సంబంధించిన కేసులో తీర్పు వెలువరుస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

2021 నవంబరులో ఉత్తర్ ప్రదేశ్ లోని కస్గంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తోంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వారిని సమీపించి బాలికను ఇంటి దగ్గర దింపుతామని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు.

మార్గమధ్యంలో వారు బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె పైజామా దారాన్ని తెంచి, కాలువ కిందకు ఈడ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వ్యక్తులు అడ్డుకోవడంతో నిందితులు పారిపోయారు.

ట్రయల్ కోర్టు ఈ చర్యలను అత్యాచార యత్నంగా భావించి భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 376 (అత్యాచారం)తో పాటు Protection of Children from Sexual Offences Act కింద కేసు నమోదు చేసింది. అయితే Allahabad High Court ఈ ఆరోపణలు అత్యాచార యత్నానికి సరిపోవని పేర్కొంటూ కేసును IPC 354-B  మరియు POCSO చట్టంలోని ఇతర సెక్షన్లకు మార్చింది.

ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన Supreme Court సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. హైకోర్టు అభిప్రాయంతో ఏకీభవించలేమని స్పష్టం చేసింది. ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీచేసింది. ఈ నేపథ్యంలోనే తాజా తీర్పు వెలువడింది.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions