KTR Thanks Ap CM Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా ఓ చిన్న రిక్వెస్ట్ ( Request ) చేస్తూ ట్వీట్ చేశారు.
చంద్రబాబు నాయుడు గతంలో ఓ మీటింగ్‌లో మాట్లాడుతున్న వీడియో క్లిప్‌ను కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో ‘ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి హయ్యస్ట్ పర్ క్యాపిటా ఇన్‌కం ( Highest Per Capita Income ) ఉంది. దానికి కారణం ప్రభుత్వం తీసుకున్న పాలసీలు’ అని చెప్పుకొచ్చారు.
ఆ వీడియో క్లిప్ ను ఎక్స్ లో పోస్టు చేసిన కేటీఆర్.. గత దశాబ్ద కాలంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల విధానాల వల్ల భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని, ఏపీ సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో ముక్తసరిగా అంగీకరించారని రాసుకొచ్చారు.
ఈ వాస్తవాన్ని జీర్మించుకోలేక పోతున్న మీ శిశ్యుడికి అవగాహన కల్పించాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యనించారు కేటీఆర్. ‘CBN గారూ ధన్యవాదాలు, దయచేసి ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ పూర్వ శిష్యుడికి అవగాహన కల్పించండి.’ అని రాసుకొచ్చారు.